![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -50 లో.....గంగని చంపడానికి సైదులు వస్తాడు. కత్తిని మెడ దగ్గర పెడతాడు. అప్పుడే రుద్ర వచ్చి రౌడీని ఆపుతాడు. గంగ బయపడి శకుంతల దగ్గరికి వెళ్తుంది. రుద్రని చూసి రౌడీ పారిపోతుంటే తన వెనకాలే రుద్ర పరిగెడుతాడు. రౌడీ పారిపోతుంటే తన చెవిలో బ్లూ టూత్ కనెక్టర్ కిందపడిపోతుంది. అది రుద్ర కి దొరుకుతుంది. ఆల్రెడీ బ్లూ టూత్ ద్వారా వీరు లైన్ లో ఉంటాడు. ఒరేయ్ తప్పించుకున్నావా నువ్వు సేఫ్ ఎనా అని వీరు అంటుంటే వీడు సేఫో కాదు తెలియదు కానీ గంగ సేఫ్ అని రుద్ర అంటాడు.
ఒరేయ్ నువ్వు ఎవరివో నాకు తెలియదు కానీ గంగని నువ్వు ఏం చెయ్యలేవని రుద్ర వార్నింగ్ ఇస్తుంటే వీరు నవ్వుతాడు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావో తెలుసు.. అక్కడ పాప కూడా సేఫ్ అని రుద్ర అనగానే వీరు షాక్ అవుతాడు. మరొకవైపు పాపని శంకర్ కాపాడతాడు. శంకర్ అచ్చం రుద్ర లాగే ఉండడంతో పాప శంకర్ ని చూసి రుద్ర అనుకుంటుంది. రుద్రకి శంకర్ ఫోన్ చేసి పాప సేఫ్ అని చెప్తాడు.
ఆ తర్వాత పెద్దసారు శకుంతలతో రుద్ర గురించి పాజిటివ్ గా చెప్తాడు. వాడు తప్పు చేసాడంటే ఎలా నమ్ముతున్నావ్.. వాడు ఎంత బాధని అనుభవిస్తున్నాడో తెలుసా అని పెద్దసారు ఎమోషనల్ అవుతాడు. అప్పుడే రుద్ర వస్తాడు. నువ్వు ఓకే కదా గంగ అని అంటాడు. ఒకే సర్ అని గంగ అంటుంది. తరువాయి భాగంలో కల్తీ ఆయిల్ ఎవరో పెట్టారని పోలీస్ లకి మక్కం కంప్లైంట్ ఇస్తాడు. దాంతో సూపర్ మార్కెట్ కి పోలీస్ వచ్చి చెక్ చేస్తారు. గంగ బ్యాగ్ లో ఇంకా కల్తీ ఆయిల్ పాకెట్స్ దొరుకుతాయి. ఇలా చేసావేంటి గంగ అని వీరు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |